Header Banner

ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!

  Fri May 23, 2025 07:32        Health

దేశంలో కోవిడ్-19 మళ్ళీ కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చాలా కాలం తర్వాత మళ్ళీ కరోనా మరణాలు సంభవించడం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (KEM) ఆసుపత్రిలో సోమవారం ఉదయం ఇద్దరు కోవిడ్-19 పాజిటివ్ రోగులు మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. మృతుల్లో ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, 54 ఏళ్ల మహిళ ఉన్నారు.


కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల ప్రజలను అప్రమత్తం కావాలని హెచ్చరిస్తోంది. తాజాగా ఏపీలో కూడా కరోనా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. వైజాగ్‌‌లో తొలి కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. నగరంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అడ్వైజరీని జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కానీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.



ఇది కూడా చదవండి: అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పై బిగ్ అప్డేట్! కలిసొచ్చేదెవరికి..!

 

కీలక సూచనలు జారీ చేసిన ఆరోగ్య శాఖ

పార్టీలు, ఫంక్షన్లు, ప్రార్థనలు వంటి సమూహ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్‌పోర్ట్‌ల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. 60 ఏళ్లు పైబడిన పెద్దలు, గర్భిణులు ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.చేతులు తరచుగా కడుక్కోవాలి. దగ్గు లేదా తుమ్ము వస్తే నోరు కప్పుకోవాలి, ముఖాన్ని తాకకుండా చూసుకోవాలి. ఎక్కువ మంది ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం చాలా అవసరం. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. విదేశాలకు వెళ్లి వచ్చిన వారు తప్పకుండా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి.అనారోగ్యంగా అనిపిస్తే ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్లకండి. ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త పడండి.


వైద్యాధికారులకు ప్రత్యేక ఆదేశాలు

హెల్త్ డైరెక్టర్ అన్ని జిల్లాల వైద్యాధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే, 24 గంటల పరీక్షల సదుపాయం కలిగిన ల్యాబ్స్ సిద్ధంగా ఉంచాలని, ప్రతి జిల్లాలోని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!

 

దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!

 

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!



ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #CoronaInAP #AndhraPradeshCovid #CovidFirstCase #CovidUpdates #APHealthAlert